బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Mar 22, 2020 , 02:45:33

పది పరీక్షలకు బ్రేక్‌ పడింది

పది పరీక్షలకు బ్రేక్‌ పడింది

  • రేపటి నుంచి జరిగే పరీక్షలు వాయిదా
  • 30 తరువాత తేదీలను ప్రకటించనున్న విద్యాశాఖ

నిర్మల్‌ అర్బన్‌ నమస్తే తెలంగాణ : జిల్లాలో శనివారం పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 9800 మంది విద్యార్థులకు  9774 మంది  హాజరుకాగా 26 మంది  గైర్హాజరైనట్లు  డీఈవో టామ్నె ప్రణీత తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద  ప్రత్యేక బృందాలతో తనిఖీలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు  తనిఖీ చేశారు. 

రేపటి నుంచి పరీక్షలు వాయిదా..

కరోనా వైరస్‌  వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన  విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను ఈ నెల 30 వరకు వాయి దా వేసిందని డీఈవో తెలిపారు. మళ్లీ ఎప్పు డు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని  పే ర్కొన్నారు.  

పరీక్షా కేంద్రం తనిఖీ

సోన్‌  మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌,  లెఫ్ట్‌ పోచంపాడ్‌ గురుకుల పాఠశాలల్లో  పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని డీఈవో ప్రణీత తనిఖీ చేశారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో 23 మంది గైర్హాజరు

ఆదిలాబాద్‌ రూరల్‌: జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు శనివారం 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆదిలాబాద్‌ డీఈవో రవీందర్‌ రెడ్డి తెలిపారు. రెగ్యులర్‌లో 10378 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 10357 మంది హాజరైనట్లు తెలిపారు. ప్రైవేట్‌ పరీక్షలకు ఆరుగురు హాజరుకావాల్సి ఉందగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అబ్జర్వర్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ జేడీ సత్యనారాయణ రెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1, ఏహెచ్‌ఎస్‌ బాలికలు, లిటిల్‌ ఫ్లవర్‌, మథర్స్‌ కేర్‌, శ్రీ సరస్వతి శిశుమందిర్‌, డీఈవో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, తిర్పెల్లి, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 


logo
>>>>>>