శనివారం 28 మార్చి 2020
Adilabad - Mar 21, 2020 , 01:38:54

ఆలయాల మూత

ఆలయాల మూత

  • బాసర, జైనథ్‌ ఆలయాల మూసివేత
  • నెలాఖరు వరకు ఆర్జిత సేవలు బంద్‌

ఆదిలాబాద్‌ రూరల్‌/జైనథ్‌: కరోనా వైరస్‌ వాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఆలయాలను మూసివేసినట్లు దేవాదాయ శాఖ  కమిషనర్‌ విజయరామారావు తెలిపారు. వైరస్‌ను నియంత్రణలో భాగంగా శుక్రవారం నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాలను మూసి వేశామన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం, గోపాలకృష్ణమఠంలోని ఆలయాలు, మంగమఠం, జైనథ్‌లోని సూర్యదేవాలయంతోసహా జిల్లాలో ధూపదీప నైవేద్యం పథకం అమలులో ఉన్న ఆలయాలను ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు మూసి ఉంచుతామని చెప్పారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు కొనసాగుతాయని, భక్తులు ఆలయాలకు వెళ్లకుండా సహకరించాలని కోరారు. 


logo