మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Mar 16, 2020 , 01:54:51

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష
  • బీసీ గురుకులాల ఎంట్రెన్స్‌టెస్ట్‌కు 4,617 మంది హాజరు
  • 1,237 మంది విద్యార్థులు గైర్హాజరు
  • 23 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు
  • సెంటర్లను తనిఖీ చేసిన ఉమ్మడి జిల్లా ఆర్సీవో గోపీచంద్‌ రాథోడ్‌

ఎదులాపురం: బీసీ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలల్లో వివిధ తరగతుల్లో మిగిన 329 సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ గోపిచంద్‌ రాథోడ్‌ అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్లకు గాను 5854 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మొత్తం 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా వివిధ పరీక్షా కేంద్రాలను రాష్ట్ర పరిశీలకుడు వై.రవికుమార్‌తో కలసి ఆర్సీవో గోపిచంద్‌ రాథోడ్‌ పరిశీలించారు. 329 సీట్లకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు 5854 మంది దరఖాస్తులు చేసుకున్నారు.  ఇందులో 6వ తరగతిలో 3015 మంది దరఖాస్తులు చేసుకోగా 2383 మంది విద్యార్థులు హాజరయ్యారు.  632 మంది  గైర్హాజరయ్యారు. 7వ తరగతిలో 1488 మంది దరఖాస్తు చేసుకోగా 1160 మంది హాజరయ్యారు. 328 మంది గైర్హాజరయ్యారు. 8వ తరగతిలో 1351 మందికి గానూ 1074 మంది పరీక్ష రాశారు. 277 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 5854 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 4617 మంది పరీక్షకు హాజరయ్యారు. 1237 మంది గైర్హాజరయ్యారు. తర్వలోనే పరీక్ష ఫలితాలు ఇంటర్నెట్‌లో ఉంచుతామని ఆర్సీవో తెలిపారు. 


logo
>>>>>>