బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Mar 16, 2020 , 01:53:05

‘ఆదివారం మన ఆదిలాబాద్‌'

‘ఆదివారం మన ఆదిలాబాద్‌'
  • నూతన కార్యక్రమానికి బల్దియా చైర్మన్‌ శ్రీకారం
  • ప్రతి ఆదివారం ఒక వార్డులో పచ్చదనం, పరిశుభ్రత పనులు
  • నాలుగు గంటల పాటు నిర్వహణ
  • పట్టణ ప్రగతి కార్యక్రమ స్ఫూర్తితో..

ఎదులాపురం: పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. ఆదివారం- మన ఆదిలాబాద్‌ పట్టణం కార్యక్రమాన్ని పట్టణంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఏదో వార్డులో 4 గంటల పాటు పరిశుభ్రత పచ్చదనం పనులను చేపడుతామన్నారు. ఇందులో స్థానికులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు ఎవరైనా పాల్గొని తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఇకనుంచి ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. పరిశుభ్రత పనులు, మొక్కల సంరక్షణ, ఆరోగ్య శిబిరాలు ఎక్కడ నిర్వహించేది ముందుగానే పట్టణ ప్రజలకు తెలియజేస్త్తామని అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయాన్ని సమాజ శ్రేయస్సుకు వెచ్చించటానికి ఆసక్తి ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఆదివారం- మన ఆదిలాబాద్‌ పట్టణం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో స్టేడియం పక్కన ఉదయం స్థానికులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మున్సిపల్‌ చైర్మన్‌ శ్రమదానం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.


logo
>>>>>>