మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Mar 09, 2020 , 23:31:15

తుప్పు తెగులు నివారణ చర్యలు చేపట్టాలి

తుప్పు తెగులు నివారణ చర్యలు చేపట్టాలి

బోథ్‌, నమస్తే తెలంగాణ : శనగ పంటలో తుప్పు తెగులు నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త దండు మోహన్‌దాస్‌ సూచించారు. మండలంలోని ధన్నూర్‌ (బీ) గ్రామంలో సోమవారం క్షేత్రస్థాయిలో శనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలన్నారు. తెగుళ్లకు ఆశ్రయం కల్పించే కలుపు మొక్కలు (యుఫోర్భియా) తొలగించాలన్నారు. సూక్ష్మ పోషకాలు త్వరగా అందేందుకు వీలుగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేయాలన్నారు. పంటకు జింక్‌, ఇనుము, గంధకము వంటి ఎరువులు అందేలా చూడాలన్నారు. తెగుళు నివారణకు ఎకరానికి ప్రాపికొనజోల్‌ 200 మిల్లీ లీటర్లు, ప్లాంటామైసిన్‌ 20 గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. రెండు రోజుల తర్వాత 19:19:19 మందును 10 గ్రాములు లీటరు నీటికి, ఫార్ములా-4  మందును 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలని సూచించారు. ఆయన వెంట రైతులు మల్కన్న, బొర్రన్న, స్టాలిన్‌, రాములు, పాషా ఉన్నారు. 


logo