శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Mar 08, 2020 , 23:53:11

మాజీ సైనిక కుటుంబాలకు వైద్య శిబిరం

మాజీ సైనిక కుటుంబాలకు వైద్య శిబిరం

ఎదులాపురం:  రెడ్‌క్రాస్‌ సొసైటీ వంద సంవత్సరలు పూర్తి  చేసుకున్న సందర్భంగా  గవర్నర్‌, కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆడిటోరియంలో మాజీ సైనికుల కుటుంబాల కోసం ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు హాజరై మాట్లాడారు.  దేశంకోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న సైనికుల కుటుంబాలను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.  వీర మరణం పొంది శౌర్యచక్ర అవార్టు గ్రహీత జి.ప్రకాశ్‌ కుటుంబంతోపాటు పలువురు సైనిక కుటుంబ సభ్యులను,  తలమడుగు ఎస్సై దివ్యభారతిని సన్మానించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ జల్లా చైర్మన్‌ గంగేశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ బాలశంకర్‌ కృష్ణ, రాష్ట్ర సమన్వయకర్త, జాతీయ విపత్తుల బాధ్యుడు పి. విజయ్‌కుమార్‌, జి.రమణ, ఎం.రమేశ్‌ కుమార్‌, స్టేట్‌ వైఎస్‌ సీజీఆర్‌సీ కన్వీనర్‌ విజయ్‌ బాబు, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ తానాజీ, అయ్యూబ్‌, కో-అర్డినేటర్‌ ప్రవీణ్‌, రూపేశ్‌ రెడ్డి, శశికాంత్‌, కుంట కిరణ్‌, చంద్రశేఖర్‌,  సైనిక బాధ్యడు చంద్రశేఖర్‌ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.logo