మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Mar 07, 2020 , 00:08:56

కవ్వాల్‌ అభయారణ్యంలోపులుల జాడ!

కవ్వాల్‌ అభయారణ్యంలోపులుల జాడ!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కొన్ని రోజులుగా పులుల సంచారంపై అధికారులు ఆరా తీసే పనిలో పడ్డారు. వాటి కోసం స్థానికుల సమాచారం మేరకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వాటి జాడ కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో వెతకగా మూడు పెద్దపులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అవి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కాగా, ఎనిమల్‌ ట్రాక్టర్స్‌ గుర్తించిన పాదముద్రల సైజుల ప్రకారం మూడు పెద్దపులులు ఉంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వాటికి ఆహారం అందించడానికి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో విరివిగా గడ్డి క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్రలోని తాడోబా, ఇతర ప్రాంతాల్లో పెద్దపులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు బృందాలు తరలివెళ్లాయి. ప్రస్తుతం కవ్వాల్‌ అభయారణ్యంలో మూడు పులుల్లో ఒకటి ఆడపులి కాగా రెండు మగ పులులు ఉన్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. 


ఖానాపూర్‌:ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పులులు ఉన్నట్లు అటవీశాఖ గుర్తించింది. తాజాగా వాటి జాడ కోసం వెతకగా మూడు పెద్దపులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో చిక్కిన పెద్దపులి తాజా చిత్రాలు, అడవుల్లో అవి సంచరించినప్పుడు ఎనిమల్‌ ట్రాక్టర్స్‌ గుర్తించిన పాదముద్రల సైజుల ప్రకారం మూడు పెద్దపులులు నివాసం ఉంటున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. అయితే వాటికి కావాల్సిన ఆహారం కోసం, అవి మసులుకునే చోట ఇతర జంతువులు, ముఖ్యంగా జింకలను రప్పించడం కోసం కవ్వాల టైగర్‌ రిజ్వ్‌ ఫారెస్ట్‌లో విరివిగా గడ్డి క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపులులు శాఖాహార జంతువులతో పాటుగా మాంసాహార జంతువులను కూడా వేటాడి తింటాయి. దీంతో వాటికి ఆహారం సులభంగా లభించేందుకు అడవిలోపలి భాగంలో గడ్డి క్షేత్రాలు, వాటికి చేరువలోనే సోలార్‌ బోర్లు, సాసర్‌ పిట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు బృందాలు మహారాష్ట్రలోని తడోబ, ఇతర ప్రాంతాల్లో అక్కడ పెద్దపులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి తరలివెళ్లాయి. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని పెద్ద పులును కూడా వాటి తరహాలోనే కాకుండా మరింత చురుకుగా కాపాడుకునేందుకు ఇక్కటి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.ప్రస్తుతం కవ్వాల్‌ అభయారణ్యంలో మూడు పులుల్లో ఒకటి ఆడపులి కాగా, రెండు మగ పులులు ఉన్నట్లు అటవీశాఖాధికారులు ఈ పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


సంరక్షణ చర్యలు చేపడుతున్నాం..

అడవుల సంరక్షణతోపాటు వన్యప్రాణుల సంరక్షణ కూడాచాలా ముఖ్యం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క రూ గుర్తించాలి. గతంలో కవ్వాల్‌ అభయారణ్యం లో పులుల ప్రవేశం జరిగినప్పటికీ కొందరు వాటిని చంపివేశారు. ఇలా మొత్తం మూడు పులులు హత్య కు గురయ్యాయి. వాటికి సంబంధించిన కేసులు కొనసాగుతున్నాయి. అడవుల్లో పులులు సంచరిస్తేనే వనం కాపాడబడుతుంది. పులులను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వాటిని సమీప గ్రామాలకు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాం.  

-సీపీ వినోద్‌కుమార్‌, ఎఫ్‌డీపీటీ, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌


logo
>>>>>>