బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Mar 04, 2020 , 23:24:43

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

తాంసి: మండలంలోని పొన్నారి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. లారీ- బైక్‌ ఢీ ఎదురెదురుగా ఢీకొనడంతో వీరు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.  తాంసి ఎస్సై రామయ్య, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సాయిపలం పంచాయతీ పరిధిలో ఉన్న రోయిపెండ్‌కు చెందిన రేనివార్‌ రామన్న(35), ఆయన కుమారుడు రేనివార్‌ నరేశ్‌ (10), తమ్ముని కుమారుడు రేనివార్‌ సంతోష్‌(8)తో కలిసి బైక్‌పై ఆదిలాబాద్‌కు వైద్యం కోసం వచ్చారు. స్వగ్రామం రోయిపెండ్‌కు వెళ్తుండగా సుంకిడి నుంచి కంకర లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీ  పొన్నారి సమీపంలోని హనుమాన్‌ మందిరం వద్ద వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  రామన్న, ఆయన తమ్ముని కుమారుడు సంతోష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. రామన్న కొడుకు నరేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై రామయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. నరేశ్‌కు రిమ్స్‌లో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


వైద్యం కోసం వెళ్లోస్తూ అనంతలోకాలకు

రేనివార్‌ రామన్న పిల్లలకు ఆదిలాబాద్‌ మండలంలోని జందాపూర్‌లో పచ్చకామెర్లకు వైద్యం చేయించేందుకు వచ్చారు. నాటు మందు తాగించి ఆదిలాబాద్‌ పట్టణంలోని బంధువులను కలుసుకున్నారు. అనంతరం స్వగ్రామం రోయిపెండ్‌కు తిరిగి వెళ్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు కబలించింది. వైద్యం కోసం వచ్చి ఇలా అన్నదమ్ముల కుటుంబ సభ్యులు  మృత్యువాత పడడంతో వారి కుటుంబ సభ్యుల రోధనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.


ప్రమాద స్థలిని పరిశీలించిన డీఎస్పీ...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును  పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


logo