మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Mar 03, 2020 , 23:34:33

పట్టణాభివృద్ధి బాధ్యత ప్రగతి కమిటీదే!

పట్టణాభివృద్ధి బాధ్యత ప్రగతి కమిటీదే!
  • సమస్యలను గుర్తించి పరిష్కరించాలి : కలెక్టర్‌
  • వార్డు కమిటీల పరిచయ వేదిక
  • ఉత్సాహంగా సాగుతున్న పట్టణ ప్రగతి
  • పాల్గొంటున్న ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు
  • ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు
  • పట్టణంలో పండుగ వాతావరణం


వార్డుల అభివృద్ధి బాధ్యత పట్టణ ప్రగతి కమిటీలదే అని కలెక్టర్‌ దేవసేన అన్నారు. పట్టణంలోని ఓ గార్డెన్‌లో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కమిటీల పరిచయ వేదికను మంగళవారం నిర్వహించారు. వార్డుల్లోని సమస్యలను గుర్తించడంతో కమిటీలు కీలకంగా వ్యవహరించాలని అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. తొమ్మిదో రోజు పట్టణంలోని అన్ని వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా సాగింది. కలెక్టర్‌ దేవసేన, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌ పలు వార్డుల్లో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. బల్దియా కార్మికులు పారిశుద్ధ్య పనులు, చెత్తా చెదారం తొలగింపు పనులను చేపడుతున్నారు. ప్రజలందరూ భాగస్వాములు అవుతుండడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. 


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆపరిశుభ్రత కారణంగా అస్తవ్యస్తంగా మారిన పట్టణాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడంతో పాటు, పచ్చదనాన్ని పెంపొందేంచుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో అధికారులు,  కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతుండగా ప్రజలు సైతం తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. పట్టణ ప్రగతిలో స్థానికుల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి అధికారులు ప్రతి వార్డుకూ నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. యూత్‌, సీనియర్‌ సిటిజన్‌, మహిళ, ఇతరుల కమిటీలు ప్రతివార్డులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కమిటీలో 15 మంది సభ్యులుగా ఉంటారు. వీరు వార్డులో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రగతి కార్యక్రమం తొమ్మిది రోజులుగా కొనసాగుతున్నది. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా జిల్లా ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఉదయం ఏడు గంటలకు వార్డుల్లో పరిశుభ్రత పనులను నిర్వహిస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు చురకుగా పాల్గొంటూ తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొదించడానికి అధికారులు స్థానిక వార్డు ప్రజలతో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా ప్రతి వార్డుకూ నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. యూత్‌, సీనియర్‌ సిటిజన్‌, మహిళ, ఇతరుల కమిటీలు ప్రతివార్డులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కమిటీలో 15 మంది సభ్యులుగా ఉంటారు. ఇలా ప్రతి వార్డులో 60 మంది స్థానికులు కమిటీల్లో  ప్రాతినిధ్యం వహిస్తారు. వార్డులు పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం, మురుగుదొడ్లు, ఇండుకు గుంతల నిర్మాణం, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, తడి, పొడి చెత్త సేకరణ లాంటి కార్యక్రమాలను వీరు పరిశీలిస్తారు. 


మరింత ప్రగతి.. 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో ఏర్పాటు చేసే కమిటీలు నిరంతరం పచ్చదనం, పరిశుభ్రత ఇతర కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పట్టణంలోని ఇండ్ల నుంచి రోజూ 66 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త తయారువుతుండగా మున్సిపల్‌ కార్మికులు పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నారు. కమిటీలో చెత్తను రోడ్లపై పడవేయకుండా అధికారులు పంపిణీ చేసిన బట్టుల్లో తడి, పొడి చెత్తను వేసి మున్సిపల్‌ రిక్షాలో వేసేలా చర్యలు తీసుకున్నారు. మురికికాల్వల్లో చెత్త, చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పడవేయకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన  జరుగుకుండా, స్థానికులు కట్టుకున్న మరుగుదొడ్లను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వార్డులో మొక్కల పెంపకం చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకునేలా అవగాహన కల్పిస్తారు. దీంతో వార్డుల్లో పరిశుభ్రత నెలకొనడంతో పాటు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులను గుర్తించి వార్డు ప్రణాళికలు తయారు చేస్తారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో యువకులు, మహిళలు, రిటైర్డు ఉద్యోగులు, స్థానికులతో కూడిన వివిధ కమిటీలను ఏర్పాటు చేయడంతో పట్టణ పరిశుభ్రత స్థానికుల భాగస్వామ్యం మరింత పెరగనున్నది. అధికారులు, మున్సిపల్‌ సిబ్బందికి వీరు సహకారం అందిచడంతో వార్డులు కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి.


logo
>>>>>>