శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Mar 02, 2020 , 23:16:03

వచ్చిన ఫిర్యాదు మళ్లీ రావొద్దు

వచ్చిన ఫిర్యాదు మళ్లీ రావొద్దు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మళ్లీ రావొద్దని, సమస్య శ్రద్ధగా విని పక్కాగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా పట్టణ, వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఫోన్‌ ద్వారా సమస్యలను విన్నవించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యక్రమంలో భాగంగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వినతులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అధికారులు అలసత్వం వహిస్తే శాఖా పరమైరన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ప్రజాఫిర్యాదుల విభాగంపై నమ్మకంతో వస్తున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆ ర్వో నటరాజన్‌, ఆర్డీవో సూర్యనారాయణ, వ్యవసాయ శా ఖ అధికారి శివకుమార్‌, ఎస్సీ, బీసీ, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. logo