గురువారం 09 ఏప్రిల్ 2020
Adilabad - Mar 02, 2020 , 23:13:56

పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలి

పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతితో ప్రజలకు సౌకర్యాలు మెరుగు పర్చాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పట్టణ ప్రగతిపై  ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వార్డుల్లో పర్యటించి పనులను గుర్తించాలని తెలిపారు. ఫ్లెక్సీ, ప్లాస్టిక్‌లను తొలగించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే పందులను దూరంగా పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కులు, ఓపెన్‌ జిమ్‌లు, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని తెలిపారు. ఓపెన్‌ ప్లాట్ల యజమానులతో మాట్లాడి పిచ్చి మొక్కలను తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కాలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. 


logo