బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Mar 01, 2020 , 22:48:25

అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి

అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి

ఎదులాపురం : సమైక్య పాలనలో ఎస్సీ సామాజిక వర్గాన్ని గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ ఎస్సీ వర్గాన్ని గుర్తించి డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇవ్వడం సంతోషకరంమని డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కైలస్‌నగర్‌లో ఉన్న అశోక్‌ బుద్ధ విహార్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్‌ను ఆదివారం సన్మానించారు. ముందుగా బుద్ధునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో డీసీసీబీ చైర్మన్‌గా ఎనుకున్నందుకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఐకేరెడ్డి, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, స్ధానిక ఎమ్మెల్యే జోగురామన్నకు రుణ పడి ఉంటానన్నారు. కార్యక్రమంలో సభ్యులు గంగారాం, వాసుదేవ్‌  తదితరులు పాల్గొన్నారు.


logo