గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 28, 2020 , T00:05

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : టీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు సంద అశోక్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం టీఎన్‌జీవో సంఘం నాయకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు సంద అశోక్‌ మాట్లాడుతూ  2018 నుంచి పీఆర్‌సీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్‌, నాయకులు గోపి, సుధాకర్‌, మహేందర్‌, విలాస్‌, శ్రీనివాస్‌, విక్రామ్‌, మల్లేశ్‌, సురేశ్‌, రవికుమార్‌, విక్రాంత్‌, సాగర్‌, నవీన్‌, పలు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. 

శంకర్‌కు వైద్యరత్న అవార్డు

ఎదులాపురం : జిల్లా కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ శంకర్‌ వైద్యరత్న అవార్డుకు ఎంపిక అయ్యారు. మారుమూల గ్రామాల్లో 20ఏండ్లుగా పేద రోగులకు సేవలందించారు. ఈయన సేవలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ వైద్యరత్న అవార్డుకు ఎంపిక చేసింది. మార్చి15న తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు. గురువారం స్థానిక వైభవ్‌ దవాఖాన సిబ్బంది శంకర్‌ను శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.

గిమ్మలో పశువైద్య శిబిరం

జైనథ్‌ : మండలంలోని గిమ్మ గ్రామంలో గురువారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి వినోద్‌ దేశ్‌పాండే పశువులకు గాలికుంటు నిరోధక టీకాలను వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ భోజన్న, నాయకులు పరమేశ్వర్‌, వెంకటేశ్‌, ప్రభాకర్‌, పశువైద్యాధికారి సిద్దార్థ్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>