బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 26, 2020 , 23:41:44

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని వీడాలి

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని వీడాలి

ఇంద్రవెల్లి : అధికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని వీడాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. మండలంలోని పిట్టబొంగురం గ్రామంలో మంగళవారం రాత్రి కలెక్టర్‌ పల్లెనిద్ర చేశారు. గ్రామంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్‌కు బస ఏర్పాటు చేశారు. రాత్రి అక్కడే పడుకొని ఉదయం 5 గంటలకు గ్రామంలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించి కంపోస్ట్‌ షెడ్లలో సేంద్రియ ఎరువులను తయారు చేయాలన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను పెంచాలని సూచించారు. గుర్తించిన సమస్యలను శాఖల వారీగా పరిష్కరించాలని చెప్పారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయాలపై ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టకుండా కార్పెట్‌ వేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ రాఘవేంద్రరావ్‌, ఎంపీడీవో రమాకాంత్‌, సీఐ నరేశ్‌ కుమార్‌, ఎస్సై గంగారామ్‌, సర్పంచ్‌ వేటి గంగా జాకేశ్‌, ఐటీడీఏ మాజీ చైర్మన్‌ సిడాం భీమ్‌రావ్‌, గ్రామపటేల్‌ వెట్టి రాజేశ్వర్‌పటేల్‌, పశువైద్యాధికారి సుదేశ్‌, ఎంపీవో సంతోష్‌, ఏపీవో సంతోష్‌ జైస్వాల్‌, ఈసీ శ్రీనివాస్‌, ఐకేపీ ఏపీఎం రామారావ్‌, విద్యుత్‌ ఏఈ చంద్రశేఖర్‌, వైద్యుడు శ్రీధర్‌ పాల్గొన్నారు.


logo