గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 26, 2020 , 23:41:03

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

ఎదులాపురం / ఆదిలాబాద్‌ రూరల్‌ : ఆదర్శ క్రీడా పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపిక పోటీలు మార్చి 3వ తేదీన ఉట్నూర్‌లోని కేబీకాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భావేశ్‌ మిశ్రా, డీడీ చందన ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్‌ (బాలికలు), జాతర్ల (బాలురు), ఉట్నూర్‌ (బాలురు)లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువు తూ 2020 ఆగస్టు 31 నాటికి 9 నుంచి 11 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న గిరిజన బాలురు, బాలికలు పోటీలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. వివిధ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు సైతం పాల్గొనవచ్చు తెలిపారు. ఎత్తు, బరువు, ఫ్లెక్సిబులిటి, వర్టికల్‌ జంప్‌, స్టాం డింగ్‌ బ్రాడ్‌ జంప్‌, 6 x 10 మీటర్లు షటిల్న్‌,్ర 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్స్‌, మెడిసిన్‌ బాల్‌త్రో, 800 మీటర్ల పరుగు పందెం పో టీలు నిర్వహిస్తారని వివరించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను క్రీడా పాఠశాల స్థాయి తుది పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. తుది పోటీల్లో ఎంపికైన వారికి ఉత్తమ బోధన, వసతి, సౌకర్యాలతోపాటు నిపుణులైన శిక్షకులతో అత్యుత్తమ క్రీడా శిక్షణ ఇస్తామని తెలిపారు. బోనాఫైడ్‌, సర్టిఫికెట్‌లతో ఉదయం 9 గంటలకు ఉట్నూర్‌ కేబీ కాంప్లెక్స్‌ మైదానంలో రిపోర్ట్‌ చేయాలనిసూచించారు. 


logo
>>>>>>