శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Feb 26, 2020 , 00:07:08

జీవో నెంబర్‌ 3ను యథావిధిగా కొనసాగించాలి

జీవో నెంబర్‌ 3ను యథావిధిగా కొనసాగించాలి

ఎదులాపురం: ఆదివాసీల హక్కులకు అత్యంత ప్రాధాన్యాత కల్పిస్తున్న జీవో నెంబర్‌ 3ను యథావిధిగా కొనసాగించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గొడం గణేశ్‌ కోరారు. అందుకు సంబంధించిన వాదనలు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రామ్‌లీలా మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ శ్రీ దేవసేనకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గణేశ్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రకారం విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో స్థానిక ఆదివాసీలకే పూర్తి అవకాశాలు ఇవ్వాలని  ఉందన్నారు. ఈ జీవో రద్దు చేస్తే పెసా చట్టం అమలు ప్రమాదం, ఆదివాసీలు ప్రమాదం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్నారు. జీవో నెంబర్‌3 రద్దు కాకుండా చూసి ఆదివాసీల అస్థిత్వాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సలాం జగ్గు పటేల్‌, కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు, సభ్యులు పాల్గొన్నారు.


logo