ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 24, 2020 , 23:20:46

పాదయాత్ర చేస్తూ.. సమస్యలు గుర్తిస్తూ..

పాదయాత్ర చేస్తూ.. సమస్యలు గుర్తిస్తూ..

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి  కార్యక్రమం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. షెడ్యూల్‌ ప్రకారం మున్సిపల్‌ పరిధిలో 49 వార్డుల్లో ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు, స్థానికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు వార్డుల్లో పాదయాత్రలు నిర్వహించి స్థానిక సమస్యలను గుర్తించారు. అనంతరం సమావేశాలు నిర్వహించారు. 34వ వార్డులో కలెక్టర్‌ శ్రీదేవసేన, ఎమ్మెల్యే జోగు రామ న్న, అడిషనల్‌ కలెక్టర్లు సంధ్యారాణి, డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ స్థానిక సాయిబాబా మంది రంలో ఉదయం ఏడు గంటలకు పూజలు నిర్వహించి పాదయాత్ర చేపట్టారు. వార్డుల్లో నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. దాదాపు రెండున్నర గంటల పాటు వార్డు పరిధిలో పాదయాత్ర నిర్వహించగా పలు సమస్యలు కలెక్టర్‌, ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌కు పలుచోట్ల లీకేజీలు ఉండడంతో కలెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ఈ సమస్యను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. మురికికాల్వలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో వాటిని తొలగించాలని ఆదే శించారు. 


పలు చోట్ల పైపులకు బిరడాలు లేకపోవడంతో నీరు వృథా పోతోందని, దీంతో వెంటనే బిరడాలు బి గించాలని సూచించారు. దుకాణాదారులతో మాట్లాడి ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించవద్దని కోరారు. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్న చిరువ్యాపారితో మాట్లాడి ప్లాస్టిక్‌ కవర్లను వాడొద్దని సూచించారు. 34వ వార్డులో పాదయాత్ర చేపట్టిన కలెక్టర్‌ స్థానికులతో మాట్లా డి వారి సమస్యలతో పాటు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా తవ్విన మట్టిని పూడ్చివేయ కుండా వదిలేస్తున్నారని దీంతో సమస్యలు వస్తున్నాయని స్థానికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. పట్టణాల అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించాలని కోరారు. వార్డులోని వివిధ చోట్ల చెత్తాచెదారం పేరుకు పోయి కంపు కొడుతుండడంతో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వార్డుల్లో చెత్తను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి బూట్లు, గ్లవ్స్‌, మాస్క్‌లు ఎందుకు ఇవ్వడం లేదని మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌ను ప్రశ్నిం చారు. వెంటనే వారికి అందజేయాలని ఆదేశించారు.


కమిటీల సభ్యులు కీలకపాత్ర పోషించాలి.. కలెక్టర్‌ శ్రీదేవసేన

34వ వార్డులో పాదయాత్ర అనంతర నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ శ్రీదేవసేన మాట్లాడారు. పరిశుభ్రత విషయంలో అధికారులకు ప్రజల సహకారం ఎంతో అవ సరమన్నారు. ఇందుకోసం వార్డు కమిటీల సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.  ప్రజలు ఇండ్లలోని చెత్తను బయట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మున్సిపాలిటీ పంపిణీ చేసిన తడి, పొడి బుట్టల్లో వేర్వురుగా వేయాలని సూచించారు. మున్సిపల్‌ రిక్షాలు, ట్రాక్టర్లు వచ్చినప్పుడు వాటిల్లో వేయాలన్నారు. చెత్తతో కంపోస్ట్‌ ఎరువులను తయారు చేసుకోవచ్చని తెలిపారు. మురికికాల్వలు శుభ్రంగా ఉండేలా చూడాలని, ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తాచెదారంతో కాల్వల్లో నీరు నిలిచి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.  బహిరంగ మలవిసర్జన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అధి కారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చ రించారు. అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, పన్నులు సకాలంలో చెల్లించాలని సూచిం చారు. పచ్చదనంలో భాగంగా నాటిన మొక్కలు ఎండి పోకుండా నీళ్లుపోయాలని కోరారు.


పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా.. ఎమ్మెల్యే జోగు రామన్న

జిల్లాలో రెండు విడతలుగా చేపట్టిన పల్లెప్రగతి కా ర్యక్రమంతో పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకొందని, సీఎం కేసీఆర్‌ పట్టణాలను అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. 34వ వార్డులో పాదయాత్ర అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రామన్న మాట్లాడారు. స్థానికులకు కౌన్సిలర్లు వార్డుల పరిశుభ్రత, పచ్చదనం లాంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిం చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకో వాలని కోరారు. వార్డుల్లో సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేశామని తెలిపారు. ప్రజలు ఇండ్లలోని చెత్తను మున్సిపల్‌ వాహనాల్లో వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి బి. ప్రభాకర్‌, డీఆర్డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌, ఎన్పీడీసీఎస్‌ ఎస్‌ఈ ఉత్తం జాడే తదితరులు పాల్గొన్నారు.


logo