శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 24, 2020 , 23:17:26

డాగ్‌స్కాడ్‌ విభాగంలోకి ‘దీప’

డాగ్‌స్కాడ్‌ విభాగంలోకి ‘దీప’

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  డాగ్‌ స్కాడ్‌ విభాగంలో మరో జాగిలం వచ్చి చేరింది. ఇప్పటికే నేరస్తులను పసిగట్టే రెండు జాగిలాలు, పేలుడు పదార్థాలు పసిగట్టే మూడు జాగిలాలు ఉండగా మరో జాగిలం వచ్చిచేరడంతో డాగ్‌ స్కాడ్‌ విభాగం మరిం త పటిష్టమైంది. కొత్త జాగిలం శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకోవడంతో శిక్షకుడు సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ విష్ణు వారియర్‌కు పరిచయం చేశారు.  హైదరాబాద్‌లోని ఐఐటీఏ మోయినాబాద్‌ కేంద్రంలో 60 జాగిలాలకు 8 నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా జాగిలాలకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు కేటాయించిన దీప జాగిలం మూడో స్థానంలో నిలిచి పతకాన్ని సాధించింది. 


డాగ్‌ శిక్షకుడు కే నాగోరావ్‌ సైతం జాగిలంతో పాటు 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్నాడు.  జాగిలాన్ని, శిక్షకుడిని ఎస్పీ అభినందించారు.  ఈ సందర్భంగా ఎస్పీ విష్ణువారియర్‌ మాట్లాడుతూ పేలుగు పదార్థాలు గుర్తించే దీప జాగిలం డాగ్‌స్కాడ్‌లో చేరడం మరింత బలం చేకూరిందని తెలిపారు. ఇప్పటికే డాగ్‌ స్కాడ్‌ విభాగంలో నేరస్తులను పసిగట్టే రెండు జాగిలాలు, పేలుగు పదార్థాలు గుర్తించడానికి మూడు ఉన్నాయని  గుర్తుచేశారు. అత్యవసర సమయంలో తనిఖీలు చేపట్టడానికి భద్రత పరంగా ముందస్తుగా బహిరంగ సభలు, రహదారులు, ప్రార్థ నా మందిరాల్లో తనిఖీలు చేపట్టడానికి ఉపయోగపడుతాయన్నారు. శాంతిభద్రతల పరిరక్షించడానికి కావాల్సిన వనరులను సమకూర్చుకొని కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతునట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ సయ్యద్‌ సుజాదొద్దీన్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌ఉల్‌హక్‌, డాగ్‌ స్కాడ్‌ ఇన్‌చార్జి రమేశ్‌, నాగోరావ్‌, పరమేశ్వర్‌, ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్‌ కవిత సిబ్బంది పాల్గొన్నారు. 


logo