గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 24, 2020 , 00:19:22

నేటి నుంచి పట్టణ ప్రగతి

నేటి నుంచి  పట్టణ ప్రగతి

ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో రెండు విడతలుగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం నిర్వహణతో గ్రామాల్లో పరిశుభ్రత నెలకొనడం తో పాటు పచ్చదనం సంతరించుకున్నది. మురికిగా మారిన పట్టణాలను సైతం అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా పదిరోజుల పాటు జరుగుతుంది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా నేడు ఉదయం 7 గంటలకు అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వార్డుకు ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులను నియమించారు.  వారు కౌన్సిలర్లు, స్థానికులతో కలిసి వార్డుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. నేడు 34 వార్డులో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానున్నది.


10 రోజుల కార్యక్రమాలు ఇలా.. 

24-02-2020 : ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, స్థానికులతో కలిసి పాదయాత్ర చేస్తూ సమస్యల గుర్తిం పు. అనంతరం వార్డు ప్రజలతో సమావేశం.

25-02-2020 : వార్డుల్లో రోడ్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలు, వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలను గుర్తించి తొలగిస్తారు.

26-02-2020 : వార్డుల్లో మురికికాల్వలను శుభ్రం చేస్తారు. ఖాళీ స్థలాల యజమానులకు నో టీసులు జారీ చేసి, శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటారు.

27-02-2020 : పబ్లిక్‌ స్థలాలను, ప్రజా సముదాయ ప్రాంతాలను శుభ్రం చేయడం, శ్రమదానం కార్యక్రమాలను నిర్వహిస్తారు.

28-02-2020 : శిథిలావస్థలో ఉన్న ఇండ్ల ను గుర్తించి వాటిని కూల్చివేయడం కోసం యజమానులకు నోటీసులు ఇస్తారు. వట్టిపోయిన బోరుబావులను పూడ్చివేస్తారు.

29-02-2020 : పట్టణంలోని వివిధ వార్డు ల్లో వంగిన, తుప్పుపట్టిన విద్యుత్‌ స్తంభాలను గుర్తించి తొలగిస్తారు. వేలాడే విద్యుత్‌ వైర్లను సరిచేయడం, మూడో విద్యుత్‌ వైర్లను బిగిస్తారు.

01-03-2020 : హరిత ప్రణాళిక కార్యక్రమం చేపడుతారు. చనిపోయిన మొక్కల స్థా నంలో కొత్తగా మొక్కలు నాటుతారు. ఇండ్ల ముందు నాటిన మొక్కలు పెరిగేలా శుభ్రం చేస్తారు. జూన్‌లో నాటాల్సిన మొక్కల డిమాండ్‌ను గుర్తిస్తారు. మొక్కల పెంపకం కోసం నర్సరీల కోసం స్థలాలను గుర్తిస్తారు.

02-03-2020 : పార్కుల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తిస్తారు. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించడం, చీకటి ప్రాంతాలను గుర్తిస్తారు. ఇండ్లపై నుంచి వేలాడే విద్యుత్‌ వైర్లను సరిచేస్తారు.

03-03-2020 : మార్కెట్‌ స్థలాలను గుర్తిస్తా రు. ఓపెన్‌ జిమ్‌, ఆట స్థలాలు, శ్మశాన వాటికల కోసం ప్రభుత్వ స్థలాలను ఎంపికచేస్తారు.

04-03-2020 : పార్కింగ్‌ స్థలాలను గుర్తిస్తారు. వార్డుల్లో సమావేశం ఏర్పాటు చేసి సమ స్య నివేదికలు తయారు చేస్తారు. logo