ఆదివారం 24 మే 2020
Adilabad - Feb 23, 2020 , 03:50:25

తుది సమరానికి ముహూర్తం ఖరారు

తుది సమరానికి ముహూర్తం ఖరారు

తాంసి : జిల్లాలో సహకార సమరానికి ఫైనల్‌ తేదీ ఖరారైంది. ఈనెల 28న డైరెక్టర్ల ఎన్నిక, 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల్లో సిం హభాగం కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎంఎస్‌)పై జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రెండింటిల్లో చైర్మ న్‌, వైస్‌చైర్మన్‌ పదవులు చేజిక్కించుకునేందుకు ఏర్పాట్లు చకచకచేస్తోంది. 


29న చైర్మన్ల ఎన్నిక...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు 77 ఉండగా.. బీ కేటగిరికి చెందిన సహకార సంఘాలు 7 ఉన్నాయి. బీ కేటగిరిలో వ్యవసాయేతర సంఘాలు చైర్మన్లు, డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. డీసీసీబీలో మొత్తం 20 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా 16 మందిని పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. అందులో ఎస్సీ డైరెక్టర్లు 3, ఎస్టీ 1, బీసీ 2 , జనరల్‌ 10 డైరెకర్లు ఉంటారు. బీ కేటగిరికి చెందిన వారిలో 1ఎస్సీ, ఎస్టీ1, 1 బీసీ, 2 జనరల్‌ సంఘాలకు చెందిన వారై ఉంటారు. డీసీఎంఎస్‌లో మొత్తం 10 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా అందులో ఆరుగురు డైరెక్టర్లను పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. ఇందులో కూడా ఎస్సీ 1, బీసీ 1, ఎస్టీ 1, ఓసి 3 అభ్యర్థులు డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. మిగతా నలుగురు డైరెక్టర్లు బీ కేటగిరికి చెందిన సంఘాలకు చెందిన చైర్మన్లు ఎన్నికవుతారు. ఇందులో కూడా  ఎస్సీ 1, బీసీ 1 జనరల్‌ 2 డైరెక్టర్లను ఎన్నుకుంటారు.


బీ కేటగిరిలో 7 సంఘాలు...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు  బీ కేటగిరిలోమొత్తం కలిపి 8 సంఘాలు అవసరం ఉండగా... కేవలం 7సంఘాలు మాత్రమే బీ కేటగిరిలో ఉన్నాయి. వాటిలో  మత్స్య సహకార సంఘాలు, దండెపల్లి, లక్షట్టిపేట్‌, మమత సూపర్‌ బజార్‌, సహకార సొసైటీ మంచిర్యాల, రాణాప్రతాప్‌సింగ్‌ లేబర్‌ కాం ట్రాక్ట్‌ సొసైటీ ఆదిలాబాద్‌, గొర్ల సంఘం, ధనోర, హైమన్‌డార్ఫ్‌ కాంట్రాక్టు లేబర్‌ సొసైటీ (ఉమ్రి) తలమడుగు, టెలికాం ఎంప్లాయీస్‌ సహకార సొసైటీ ఆదిలాబాద్‌ ఉన్నాయి. ఈ సంఘాల్లో 3 డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో రిజిస్ట్రేషన్‌ అయి ఉండడంతో ఎక్కడో ఒక చోట ఓటు వేయడానికి అవకాశం ఉంది. మొత్తానికి ఏడు సొసైటీల చైర్మన్లు డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా ఏకగ్రీవం కానున్నారు. డీసీఎంఎస్‌లో ఒక డైరెక్టర్‌ ఖాళీగా ఉండనుంది.


25న నామినేషన్‌...

ఆదిలాబాద్‌ సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ఆదిలాబాద్‌ జిల్లా సహకార మార్కెటింగ్‌ సం ఘం( డీసీఎంఎస్‌) పాలక మండ లి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేశారు. ఈనెల 25న ఉదయం 8గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు డైరెక్టర్‌ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. డీసీసీబీ డైరెక్టర్‌ నామినేషన్లను ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆదిలాబాద్‌ సహకార కేంద్ర బ్యాంకులో, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల నామినేషన్లను ఆదిలాబాద్‌ జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘంలో స్వీకరిస్తారు. వచ్చిన నామినేషన్లను మధ్యాహ్నం 1.30 నుంచి 3.00గంటల వరకు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ అదే రోజు సాయంత్రం 3.30 నుంచి 5.00గంటల వరకు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5.00 గంటల తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గు ర్తులు కేటాయిస్తారు. ఈ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధిం చి ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు అయినట్లయితే నామినేషన్‌ వేసిన అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లుగా 28వ తేదీన ప్రకటిస్తారు. ఒక వేళ పోటీ ఉండి ఎన్నిక నిర్వహించినట్లయితే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రహాస్య పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల ఫలితాలను ఆదిలాబాద్‌ సహకార కేంద్ర బ్యాంకు వద్ద ప్రకటిస్తారు.


29న చైర్మన్ల ఎన్నిక...

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఈనెల 29న ఎన్నుకోనున్నారు. డైరెక్టర్లుగా ఎన్నికైన అభ్యర్థులు వీరిని ఎన్నకోనున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఉదయం 8.30 నుంచి 9.00గంటల వరకు జరుగుతుంది. డీసీసీబీ డైరెక్టర్లు, చైర్మన్‌, వై స్‌ చైర్మన్‌ ఎన్నికలకు మురళీధర్‌రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించనుండగా... డీసీఎంఎస్‌ ఎన్నికల అధికారిగా బి.మోహన్‌ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నియమించింది.


logo