శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 22, 2020 , 03:45:56

పట్టణ ప్రగతికి వార్డు కమిటీలు!

పట్టణ ప్రగతికి వార్డు కమిటీలు!

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పట్ణణ ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ  కార్యక్రమం కొనసాగనున్నది. పట్టణ ప్రణాళికలో భాగంగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బల్దియా అధికారులు చైర్మన్‌, కౌన్సిలర్ల  భాగస్వామ్యంతో ఇప్పటికే వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. నివేదికలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌  డేవిడ్‌, కలెకర్‌ దేవసేనకు అందజేశారు.


పల్లె ప్రగతి స్ఫూర్తిగా..

ప్రభుత్వం గ్రామజ్యోతి, పల్లెప్రగతి ప్రణాళిక, తదనంతరం అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తూ మంచి ఫలితాలు రాబట్టిన విషయం తెలిసిందే. ఇదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆలోచన, ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇపుడు పట్టణ ప్రణాళికను నిర్మాణాత్మకంగా అమలు చేయడానికి కంకణం కట్టుకున్నది.  పటణ  ప్రణాళిక విధివిధానలపై ఇప్పటికే పురపాలక శాఖా మంత్రి మొన్న హైదరాబాద్‌లో కలెక్టర్లతో సమావేశమై విధి విధానాలు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులకు పట్టణ ప్రణాళికపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.  పట్టణ ప్రణాళిక కార్యక్రమం ఒక యజ్ఞంలా నిర్వహించాలని అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర హెచ్చరించారు. 


వార్డుకు 60 మంది సభ్యులు.. 

గతంలో పల్లె  ప్రణాళిక, గ్రామజ్యోతి కార్యక్రమాల్లో స్థానిక వార్డు సభ్యులను భాగస్వాములను చేసేవారు. అలాగే ఇపుడు పట్టణ ప్రణాళికలో సైతం వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డుకు 60 మంది చొప్పున 49 వార్డులకు  మొత్తం 2940 మంది సభ్యులను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలు, 15 మంది యువకులు, 15 మంది సీనియర్‌ సిటిజన్స్‌ 15 మంది ఇతరులు ఉన్నారు. వీరి బాధ్యతలు.. పారిశుద్ధ్యం, మొక్కల సంరక్షణ, కొత్త పనులపై ప్రణాళిక రూపొందించడం తదితరాలు ఉంటాయి.  అభివృద్ధిలో కీలకమైన పట్టణ ప్రణాళిక  కార్యక్రమం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకాధికారులను సైతం నియమించారు.


logo