గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 22, 2020 , 00:40:35

శివోహం..

శివోహం..

జిల్లాలో ఉన్న శైవక్షేత్రాలన్నీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శివపార్వతుల కల్యాణం వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా చేపట్టారు.

  • ఘనంగా శివరాత్రి వేడుకలు
  • భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
  • శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
  • ఆలయాల్లో ప్రత్యేక పూజలు
  • తెల్లవారు వరకూ జాగరణ
  • నేడు పలు ఆలయాల వద్ద అన్నదానాలు

జిల్లాలో ఉన్న శైవక్షేత్రాలన్నీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శివపార్వతుల కల్యాణం వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా చేపట్టారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలను ఆచరించిన భక్తులు సాయంత్రం పండ్లతో దీక్షను విరమించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వసతులు కల్పించారు. శుక్రవారం రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము వరకు భక్తులు జాగరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నేడు పలు ఆలయాల వద్ద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

- నమస్తే తెలంగాణ యంత్రాంగం


హరహర మహాదేవా...శంభో శంకర అంటూ శివనామ స్మరణ శైవ క్షేత్రాలు మార్మోగాయి. జిల్లాలో శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని ఆలయాలతోపాటు  జిల్లాలోని పలు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

-నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ 


logo
>>>>>>