మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 21, 2020 , 04:02:53

మెరుగైన జీవితాన్ని ఇద్దాం

మెరుగైన జీవితాన్ని ఇద్దాం

ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్‌ శ్రీ దేవసేన అన్నారు. గురువారం మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులకు జడ్పీ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు.

  • పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సులో కలెక్టర్‌ శ్రీదేవసేన

ఎదులాపురం : ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్‌ శ్రీ దేవసేన అన్నారు. గురువారం మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులకు జడ్పీ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో పట్టణ రూపురేఖలను మార్చాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారని తెలిపారు. రెండు రోజుల క్రితమే రాష్ట్రంలోని కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు పట్టణ ప్రగతిపై దిశా నిర్దేశం చేశారని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా కార్యక్రమాలను నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం నిర్వహించాలన్నారు. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి మంచి ఫలితాలు  రాబట్టామని, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి నిర్వహించాలని సూచించారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. ఇంటి నుంచి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, సేకరించిన చెత్తను కంపోస్ట్‌ చేసి ఎరువుగా వినియోగించుకోవాలని చెప్పారు. పట్టణ ప్రాంతంలో పచ్చదనం కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. వార్డుల్లో అధికారులు, కౌన్సిలర్లు కలిసి ఖాళీ ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మాణం చేయాలన్నారు. వార్డు ప్రజలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. పట్టణ ప్రగతిపై అవగాహన కల్పిస్తూ పారిశుద్ధ్యంపై ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి, వాటితో వచ్చే ఆరోగ్య సమస్యలపై వివరించాలని చెప్పారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలటీలు, కార్పొరేషన్‌లు, జీహెచ్‌ఎంసీ కలుపుకొని ప్రతి నెల రూ.140 కోట్లు కేటాయిస్తోందని తెలిపారు. ఆరు నెలల్లో సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ పర్యటన ఉంటుందన్నారు. అనంతరం ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలను పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పరిష్కరించామన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మొదటి స్థానంలో ఉంచేందకు అందరి సహకారం అవసరం అన్నారు. అనంతరం కలెక్టర్‌ను మున్సిపల్‌ అధికారులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషన్‌ కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, డీఆర్‌డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌, ఆర్‌డీవో సూర్యనారాయణ, పట్టణ కౌన్సిలర్‌లు, ప్రత్యేక అధికారులు ఉన్నారు.logo
>>>>>>