గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 19, 2020 , 23:27:44

అమరుడి కుటుంబానికి పరామర్శ

అమరుడి కుటుంబానికి పరామర్శ

బోథ్‌, నమస్తే తెలంగాణ : మండలంలోని మర్లపెల్లి గ్రామాన్ని బుధవారం సీఆర్‌పీఎఫ్‌ హైదరాబాద్‌ సౌత్‌ సెక్టార్‌ డీఐజీపీ సజావొద్దీన్‌ సందర్శించారు. మొదట సీఆర్‌పీఎఫ్‌ అమర జవాను గొడ్సె సతీశ్‌గౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబీకులను పరామర్శించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 2016 సంవత్సరం మే 5న చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సతీశ్‌గౌడ్‌ మరణించాడు. వారి కుటుంబ పరిస్థితులను పరిశీలించేందుకు డీఐజీపీ బుధవారం ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సహాయం అందిందా లేదా అని ఆరా తీశారు. కుటుంబానికి పెన్షన్‌ వస్తుందా అని తల్లిదండ్రులు గొడ్సె సూర్యమాల - లింగాగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. సతీశ్‌గౌడ్‌ ఉద్యోగ వివరాలతో కూడిన సర్టిఫికెట్లను కుటుంబీకులకు అందజేశారు. ఏవైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. అనంతరం గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. ఆయన వెంట కుటుంబీకులు సందీప్‌గౌడ్‌, అక్షయ్‌గౌడ్‌, తహసీల్దార్‌ శివరాజ్‌, ఎస్సై పి.రాజు, సర్పంచ్‌ కల్లూరి దేవేందర్‌, మాజీ ఎంపీటీసీ రామెల్లి భోజన్న ఉన్నారు.


logo