సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 19, 2020 , 01:04:41

పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం

పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం

పల్లెప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని పట్టణప్రగతిని పకడ్బందీగా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణప్రగతి కార్యక్రమ నిర్వహణపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

  • పనులు పకడ్బందీగా చేపట్టాలని సీఎం ఆదేశం
  • ఈనెల 24 నుంచి పది రోజుల పాటు నిర్వహణ
  • పట్టణాలు పరిశుభ్రంగా మారాలి
  • శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి
  • విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి
  • హాజరైన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్‌

పల్లెప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని పట్టణప్రగతిని పకడ్బందీగా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణప్రగతి కార్యక్రమ నిర్వహణపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించే పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టాలన్నారు. పది రోజల ప్రణాళికలో పట్టాణాలన్నీ పరిశుభ్రంగా మారాలని, పచ్చదనం వెల్లివిరియాలని సూచించారు. శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గజ్వేల్‌ తరహాలో అభివృద్ధి సాధించాలని సీఎం సూచించారు. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశం అనంతరం గజ్వేల్‌ను సందర్శించారు. 


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రణాళిక బద్ధంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మున్సిపల్‌ సదస్సులో సీఎం కేసీఆర్‌ ఈనెల 24వ తేదీ నుంచి పది రోజుల పాటు నిర్వహించే పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, ము న్సిపల్‌ చైర్మన్‌లకు దిశా నిర్దేశం చేశారు. పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ పరిధిలో ఏ విధమైన పనులు చేపట్టాలో ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు అంతటా పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పదిరోజుల పాటు ప్రతి వార్డుల్లో అధికారులతో కలిసి పర్యటించాలని స్థానిక సమస్యలను గుర్తించాలని సూచించా రు. పట్టణాల్లోని వార్డుల్లో సమస్యలను గుర్తించిన ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వార్డుల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల్లో అప్పటికప్పుడూ పరిష్కరించే సమస్యల్లో జాప్యం చేయొద్దని సూచించారు. మున్సిపాలిటీలకు ప్రతి నెలా నిధులు మంజూరవుతాయ ని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొ ని పట్టణాల అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించా రు. వార్డుల్లో తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, చెత్త సేకరణకు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. ముళ్లపొదలు, తుమ్మలను తొలగించాలన్నారు.


 పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు పచ్చదనం నెలకున్నదని, పట్టణప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటీలు సైతం పరిశుభ్రంగా మారడంతో పాటు ప చ్చదనం వెల్లివిరియాలని సూ చించారు. మురికికాల్వలను శుభ్రపర్చడం, మొక్కలు నాటడంతో పాటు హరిత ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పట్టణాలకు సమీప గ్రామాల్లో నర్సరీలను ఏర్పా టు చేసుకొని మొక్కల పెంప కం చేపట్టాలని సూచించారు. పట్టణాల్లోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను మె రుగుపర్చాలని, గుంతలను పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌ ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి కృషి చేయాలని, పబ్లిక్‌ టాయిలెట్స్‌ ని ర్మించాలని, వీటి కోసం స్థలాలను గుర్తించాలన్నారు  ము న్సిపాలిటీలో వివిధ ఖాళీలను గుర్తించి వివరాలను అందజేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణాల్లో వి ద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు వినియోగించుకోవాలన్నారు. వంగిన, తుప్పుపట్టిన, రోడ్లకు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని, వేలాడుతున్న వైర్లను సరిచేయాలని సూచించారు. ఈ సదస్సులో కలెక్టర్‌ శ్రీదేవసేన, అదనపు కలెక్టర్‌ డెవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పాల్గొన్నారు.


గజ్వేల్‌ తరహాలో పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించడంతో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్లు, పార్కు, శ్మశాన వాటిక తదితర ప్రదేశాలను పరిశీలించారు.


logo