బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Feb 17, 2020 , 23:29:01

‘హరిత’ స్ఫూర్తి

‘హరిత’ స్ఫూర్తి

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి :ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు వే డుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకా రం వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు, స్వ చ్ఛంద సంస్థలు, ప్రజలు భారీ సంఖ్యలో మొక్క లు నాటారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ జడ్పీ కార్యాలయం ఆవరణలో అధికారు లు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు తాంసి మండలం కప్పర్ల, బండలనాగాపూర్‌, భీంపూర్‌ మండలం అర్లీ ప్రభుత్వ పాఠశాలలో నాయకులు, స్థానికు లు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మా వల పార్కులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, కౌన్సిలర్లు, స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. మావల పార్కులో ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు మొక్కలు నాటారు. జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, జిల్లా అటవీశాఖ అధికారి బి. ప్రభాకర్‌, డీఆర్‌డీవో రాథోడ్‌ రాజేశ్వర్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ జాడే ఉత్తం, జడ్పీ సీఈవో కిషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌ రాథోడ్‌, ఐసీడీఎస్‌ పీడీ మిల్కా, డీపీఆర్‌వో భీంకుమార్‌, అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. 


వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో.. 

వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో  సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నా టారు. యాపల్‌గూడ రెండో పోలీస్‌ బెటాలియల్‌లో కమాండెంట్‌ ఆర్‌.వేణుగోపాల్‌, పోలీసులతో కలిసి పెద్దమొత్తలో మొక్కలను నాటారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మొక్కల నాటి, పెంపకాన్ని చేపట్టారు. టీఎన్జీవోలు కూడా ఈ కా ర్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ బాలుర వసతిగృహం ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలల్లో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మొ క్కలు నాటారు. తాంసి మైనార్టీ పాఠశాలలో వి ద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యా ప్తంగా  గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు మొక్కలు నా టారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.కజ్జర్ల రామాలయంలో డీసీసీబీ చైర్మన్‌ ముడుపు దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌, స్థానికులు, విద్యార్థులు, నమస్తే తెలంగాణ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. వీటి సంరక్షణ బాధ్యతను తాము చూసుకుంటామని సర్పంచులు, స్థానికులు తెలిపారు. 


logo
>>>>>>