సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 17, 2020 , 23:27:17

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తాం

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తాం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. మహబూబాబాద్‌లో అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ను ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజానిలతోపాటు కలెక్టర్‌ కార్యాలయంలోని పలు విభాగాల ఉద్యోగులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అదనపు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని తెలిపారు. అందుబాటులో ఉంటూ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తన పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీఆర్వో నటరాజన్‌, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, జడ్పీసీఈవో కిషన్‌, ఈఈ సాంబయ్య, కార్యాలయ ఏవో పాల్గొన్నారు. 


logo