శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 16, 2020 , 01:45:49

ఐటీఏడీ పీవోగా భావేశ్‌ మిశ్రా

ఐటీఏడీ పీవోగా భావేశ్‌ మిశ్రా

ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ : ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా అన్నారు. శనివారం ఆయన పీవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంతో పాటు పలు కార్యాలయాలను సందర్శించారు.  ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనకు గిరిజనుల సమస్యలు తెలుసన్నారు. భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా 20 నెలల పాటు విధులు నిర్వహించానని అప్పుడు వారి సమస్యలు పూర్తిగా తెలుసుకున్నానన్నారు. 24 గంటలు గిరిజనులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.. గిరిజనులలో ఎక్కువగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ సమస్య ఉందన్నారు. 


దానిని సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. ఐటీడీఏలోని అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను గిరిజనులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. అవినీతి అక్రమాలకు ఉపేక్షించేది లేదన్నారు. గిరిజనులు ఐటీడీఏకు వచ్చి సమస్యలు చెప్పిన, ఫోన్‌, వాట్సప్‌ ద్వారా సమాచారం అందించిన పరిష్కరిస్తామన్నారు. తనది ఢిల్లీ అని, ఐఐటీ బీటెక్‌ పూర్తిచేసి 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు సెలెక్ట్‌ అయ్యాయనన్నారు. తండ్రి మితిలేశ్‌ కుమార్‌ మిశ్రా  తల్లి జయంతి, భార్య ఇలా త్రిపాఠి ఐఏఎస్‌ త్వరలో మంచిర్యాల జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నట్లు వివరించారు. అనంతరం ఐటీడీఏ అధికారులు, ఆర్డీవో, ఇతర శాఖల అధికారులు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించారు. ఏపీవో జనరల్‌ కనక భీంరావు, ఆర్డీవో వినోద్‌కుమార్‌, వివిద శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.


logo