ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నేడే ‘సహకార’ ఎన్నికలు

నేడే ‘సహకార’ ఎన్నికలు

Feb 14, 2020 , 23:19:04
PRINT
నేడే ‘సహకార’ ఎన్నికలు

ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని ప్రాథమిక సహకార సం ఘాల ఎన్నికలు నేడు జరుగున్నాయి. శనివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రా రంభకానుండగా మధ్యా హ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. మధ్యా హ్నం తర్వాత ఓట్ల లెక్కింపు చేపడుతారు.  ఓట్లు తక్కువగా ఉండడంతో కేవలం రెండు గంటల వ్యవధిలో ఫలితాలు విడుదలకానున్నాయి. మొత్తం 28  ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా 17 సంఘాల్లోని డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

లండసాగ్వి, తాంసి, జామిడి(ఏ), హస్నాపూర్‌, గూడ రాంపూర్‌, జామిడి(బీ), ముక్రా, మాన్కాపూర్‌, నర్సాపూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి ప్రాథమిక సహకార సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 17 సొసైటీల్లోని 133 నియోజకవర్గాలకు(టీసీలకు) నేడు ఎన్నికలు జరుగునుండగా 282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు ఆదిలాబాద్‌, చాందా(టీ), తంతోలి, తలమడుగు, ఝరి, జైనథ్‌, మేడిగూడ, బేల, డోప్టాల, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, మన్నూర్‌, నేరడిగొండ, కుమారి, బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌ ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరుగునున్నాయి. 17 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనుండగా ఇందుకోసం 133 డైరక్టర్‌ పదవులకు 282 మంది పోటీ పడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు ఉన్న గ్రామాలు, మండల కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు  చేశారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. 

ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరుగురు రూట్‌ అధికారులు, ఆరుగురు జోనల్‌ అధికారులు, ఎన్నికలు జరిగే ప్రతి పీఏసీఎస్‌కు ఒకరు చొప్పున 17 మంది ఎన్నికల అధికారులు, 133 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 220 మంది పోలింగ్‌ అధికారులను నియమించారు. 

ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో పోలింగ్‌ సిబ్బందికి శుక్రవారం ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన 24 వాహనాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల  నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల కోసం 85 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందిని నియమించారు. సహకార ఎన్నికలను జిల్లా సహకార అధికారి మోహన్‌, ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా విద్యాధికారి రవీందర్‌ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.


logo