శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Feb 14, 2020 , 23:13:04

విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు

విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు

కడెం : సబ్‌స్టేషన్లతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్ల వ ద్ద ఏర్పాట్లు చేసి విద్యు త్‌ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్‌ సీ జీఎం నగేశ్‌ అన్నారు. శుక్రవారం డీఈ మ ధుసూదన్‌తో కలిసి కడెం, లింగాపూర్‌ గ్రామాల్లోని సబ్‌స్టేషన్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పలు ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించిన అనంతరం సిబ్బందితో మాట్లాడారు. సబ్‌స్టేషన్ల వద్ద సౌకర్యాల కల్పనతో పాటు, నిరంతర విద్యుత్‌ను అం దించేందుకు సౌకర్యాలను కల్పించాలని సూ  చించారు. ప్రధానంగా రోడ్డుకు ఇరువైపులా అవసరాల మేర కు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ప్రధానరోడ్డుపై ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ లు భారీ వాహనాలకు తాకుడా, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, అన్ని గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మ ర్ల నిర్వహణను సిబ్బం ది చూడాలని ఆదేశించారు. గృహ అవసరాలతో పాటు, వ్యవసాయానికి అసరమైన విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, బిల్లుల వసూళ్లలో జాప్యం చేయకూడదని ఆదేశించారు. ఇప్పటికే పల్లెప్రగతితోపాటు, 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా గ్రామాల్లో మరమ్మతుల పనులు చేపట్టిన దృష్ట్యా ఆయన అవసరమైన విద్యుత్‌ పోల్స్‌, థర్డ్‌ లైనింగ్‌ వంటి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కడెం మండలంలోని బెల్లాల్‌ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు పూర్తికాగా, సిబ్బంది లేని కారణంగా ప్రారంభానికి సమయం పడుతుందని, సిబ్బంది నియామకం అనంతరం త్వరలోనే సబ్‌స్టేషన్‌ ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. డీఈ మధుసూదన్‌, ఏఈ సుమన్‌కుమార్‌, సిబ్బంది విలాస్‌, తదితరులున్నారు. 


logo