ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 14, 2020 , 23:10:50

18న అధికారికంగా సేవాలాల్‌ జయంతి

18న అధికారికంగా సేవాలాల్‌ జయంతి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అధికారులను అదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ 18న సేవాలాల్‌ మహరాజ్‌ 281వ జయంతి వేడుకలను పట్టణంలోని రామ్‌లీలా మైదానంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సేవాలాల్‌ జయంతిపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. సేవాలాల్‌ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలన్నారు. ఉత్సవ కమిటీ సహకారంతో వేదిక, పూజా కార్యక్రమాలు, రవాణా, భోజనం తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. అనంతరం బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ మాట్లాడుతూ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఘనంగా నిర్వహించేదుకు ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు రూ.10లక్షల కేటాయించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు బాధ్యతతో వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు చందన మాట్లాడుతూ ఉత్సవ కమిటీ సహకారంతో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేపట్టి విజయవంతం చేస్తామన్నారు. ఆయా శాఖల అధికారులకు విధులు కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తమ్‌కుమార్‌ జాడే, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఉత్సవకమిటీ సభ్యుడు రాథోడ్‌ రామారావు, శివలాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. logo