గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 13, 2020 , 23:51:49

ఫిట్‌ ఇండియాలో భాగస్వాములు కావాలి

 ఫిట్‌ ఇండియాలో భాగస్వాములు కావాలి

ఆదిలాబాద్‌ రూరల్‌: ఫిట్‌ ఇండియాలో ప్రతి ఒక్కరూ భ్యాగస్వాములు కావాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాలలో ఫిట్‌ఇండియా కార్యక్రమంపై వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని శారీరకంగా దృఢంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పాఠశాల వయస్సులోని విద్యార్థులందరికీ తప్పని సరిగా వ్యాయామం చేయించాలన్నారు. ప్రతి పాఠశాలలోనూ వారం రోజులు గంట పాటు వ్యాయామం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులకు యోగా, క్యాలెస్థనిక్స్‌, డంబెల్స్‌, లెజిమ్స్‌తో పాటు ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షకార్యదర్శులు పార్థసారథి, కృష్ణ, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి గుండి మహేశ్‌, దయానంద్‌ రెడ్డి, కాంతారావ్‌, జక్కుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

logo