బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 13, 2020 , 23:51:49

నీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు

నీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. గురువారం నిర్మల్‌ జిల్లాలోని దిలావర్‌పూర్‌ మండలం మాడేగావ్‌ గ్రామంలో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. నిర్మల్‌ జిల్లా నుంచి ఆదిలాబాద్‌కు మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతుందన్నారు. పట్టణానికి ప్రతిరోజూ నీరు సరఫరా చేయాలని కోరామన్నారు. అక్కడి సిబ్బంది సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తికావస్తున్నాయని తెలిపారు. చేతి పంపులు, కులాయిలకు మరమ్మతులు చేపట్టి నీటి లీకేజీలను అరికట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో నీటిని అందించడానికి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు, సిబ్బంది ఉన్నారు.


logo