ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 13, 2020 , 23:48:38

గురుకుల పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

గురుకుల పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ఎదులాపురం: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ అగస్టీన్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్‌ బంగ్లా నుంచి తెలంగాణ చౌక్‌ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 5వ తరగతి ప్రవేశం కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో అత్యుత్తమ విద్యా బోధన, జీవిత సాఫల్య నైపుణ్యాలు అందజేయడం, ఐఐటీలో మెడికల్‌ ఫౌండేషన్‌, క్రీడా, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, బుధ, ఆదివారాల్లో ప్రత్యేక భోజనం, ప్రతిరోజూ పండ్లు, పాలు, గుడ్లతో మెనూ ఉంటుందన్నారు. ఆధునిక విద్యా విధానంలో భాగంగా గురుకులల్లో మాత్రమే మాడ్యులర్‌ టీచింగ్‌ ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశన్ని సద్వియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో వైస్‌ప్రిన్సిపాల్‌ హేమంత్‌, ఉపాధ్యాయులు వెంకటస్వామి, సుజాత, రామకృష్ణ, జాహిద్‌ తదితరులు ఉన్నారు.


logo