గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 12, 2020 , 23:13:44

పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పట్టణాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని శాంతినగర్‌ కాలనీని సందర్శించారు. వార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డులను సందర్శించి ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. దశల వారీగా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రోడ్లపై చెత్తను వేయవద్దని, చెత్త సేకరణకు వాహనాలు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేయాలన్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచినట్లే పరిసర ప్రాంతాలను సైతం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి రోజూ మున్సిపల్‌ కార్మికులు వార్డుల్లో డ్రైనేజీల్లో పూడికను తీయించాలని అధికారులను ఆదేశించారు. ఈగలు, దోమలు ప్రబలకుండా మురికి నీరు నిల్వన్నచోట బ్లీచింగ్‌ పౌడర్‌ను వేయలని సూచించారు. రాబోవు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ట్యాంకర్లను ఏర్పాటు చేయాలన్నారు. చెడిపోయిన చేతి పంపులను సైతం మరమ్మతులు చేయించాలని సూచించారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తికావస్తున్నాయని, ప్రతి ఇంటికీ శుద్ధజలాలు సరఫరా చేస్తామని తెలిపారు. పట్టణ ప్రజలకు సమస్యలు రాకుండా చూస్తామన్నారు. పట్టణ ప్రణాళికను అమలు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజానీ, కౌన్సిలర్లు అజయ్‌, సందనర్సింగ్‌, పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 


logo
>>>>>>