గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 11, 2020 , 23:39:42

దిశా నిర్దేశం

దిశా నిర్దేశం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడంమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యమై ఉండాలని, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. విస్తృత మేథోమథనం, అనేక చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక ధృష్టితో చట్టాలు తీసుకువస్తుందని, కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు కార్యక్రమాల అమలు కలెక్టర్‌ల ప్రాధాన్యత కావాలని సూచించారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, తక్కువ వ్యవధిలోనే రాష్ట్ర అద్భుత ప్రగతిని సాధించినట్లు తెలిపారు. కలెక్టర్‌లు ఎవరి ప్రాధాన్యతలు ఎంచుకోకుండా అధికార యంత్రాంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని టీ వర్క్‌ చేయాలని సూచించారు. మిషన్‌ భగరీథ పథకం ప్రజల రక్షితమైన నీటిని అందిస్తుందని, రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ల వ్యవస్థను బలోపేతం చేయడానికి అడిషనల్‌ కలెక్టర్‌లను నియమించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌లపై ప్రభుత్వానికి ఎంతో నమ్మకం ఉందని వారు బాధ్యతగా పనిచేయాలని కోరారు. కలెక్టర్‌లు పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత నెలకొల్పడంతో పాటు పచ్చదనం పెంపొదించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కొత్త జిల్లాలు, డివిజన్‌లు మండలాలు, పంచాయతీల ఏర్పాటుతో పరిపాలన విభాగాలు చిన్నవిగా మారాయని వీటితో పల్లెలు బాగుచేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రతి నెల రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌లు స్థానిక సంస్థలుకు కేటాయించడం జరిగిందని వారు స్థానిక సంస్థలను సమర్థంగా పనిచేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

పంచాయతీ రాజ్‌ సమ్మేళనాలు           

పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో  పంచాయతీ  రాజ్‌ సమ్మేళనాలను నిర్వహించాలని  వీటికి సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీడీసీలను ఆహ్వానించాలని కోరారు. సమ్మేళనాల్లో ఎవరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలని,  వివరించాలని, విధులు, బాధ్యత లు తెలియజేయాలని మంత్రులు, ఎంపీలు, జడ్పీ చైర్మన్‌లులను అతిధులుగా ఆహ్వానించాలన్నారు. గ్రామాల పరిశుభ్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్‌లు వ్యవహించాలని కోరారు. గ్రామాల్లో మొక్కలు నాటడంతో పాటు అడవులను సంరక్షించేదుకు చర్యలు తీసుకోవాలన్నారు. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించాలని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అక్కడి నుంచి ప్రారంభించాలన్నారు. తెలంగాణ అక్షరాస్యతలో వెనకబడి ఉందని రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మార్చేందుకు కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీదేవసేన, అదనపు కలెక్టర్‌ జి. సంధ్యరాణి పాల్గొన్నారు.


logo