మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Feb 11, 2020 , 23:34:44

ప్రైవేటు దవాఖానల్లో ఐటీ అధికారుల తనిఖీలు

ప్రైవేటు దవాఖానల్లో  ఐటీ అధికారుల తనిఖీలు

ఆదిలాబాద్‌ /నమస్తే తెలంగాణ ప్రతినిధి:జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు దవాఖానల్లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన అధికారులు ఆదాయపు పన్ను చెల్లించిన వివరాలతోపాటు బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. కీలక పత్రాలను సైతం సేకరించి పరిశీలించారు. దవాఖానలకు వస్తున్న ఆదాయ, వ్యయాలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో పలువురు వైద్యులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఐటీ దాడులతో పట్టణంలోని పలు ప్రైవేటు దవాఖానల నిర్వాహకులు ఆందోళన  చెందుతున్నారు.


logo