గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 11, 2020 , 23:34:44

లక్ష్యంతో ముందుకుసాగాలి

లక్ష్యంతో ముందుకుసాగాలి

ఆదిలాబాద్‌ రూరల్‌ / జైనథ్‌ / ఉట్నూర్‌ రూరల్‌ : విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని అందుకు తగ్గట్లుగా సాధన చేస్తే తప్పక విజయం సాధిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రిజర్వ్‌పోలీస్‌లైన్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఐటీడీఏ డీడీ చందనతో కలిసి డిక్షనరీలు, ప్యాడ్‌లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యమున్న ఉపాధ్యాయులున్నారని, వారు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని ఆచరిస్తే రాణించ వచ్చని అన్నారు. ఈ ఏడాది పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెంచాలన్నారు. ఐటీడీఏ డీడీ చందన మాట్లాడుతూ.. తాను చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఈస్థాయికి వచ్చానని గుర్తుచేశారు. అనంతరం పాఠశాలలో హరితహారం కింద మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షాహిదాబేగం, ఎస్‌ఎంసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌, ఏఎస్‌వో శ్రీహరి, సెక్టోరల్‌ అధికారి కంది శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, బొర్రన్న, రవిజబాడే, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

జైనథ్‌ : పేద విద్యార్థులకు డిక్షనరీలు అందిస్తున్న సాయి వైకుంఠ, తుల యాదయ్య స్వచ్ఛంద సంస్థల పనితీరు అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మేడిగూడ(ఆర్‌)లో పాఠశాల విద్యార్థులకు వంద డిక్షనరీలు అందజేశారు. కార్యక్రమంలో సాయి వైకుంఠ ట్రస్టు డైరెక్టర్‌ నర్ర నవీన్‌ యాదవ్‌, జిల్లా యువజన క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, కో-ఆర్డినేటర్‌ మసూద్‌, ఎంఈవో నారాయణ, ఎస్సై వెంకన్న, ఏఎస్‌వో శ్రీహరి, స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, హెచ్‌ఎం సత్యనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్లు అడెల్లు, మహేందర్‌, ఉపాధ్యాయులు భవానీ, ఆనంద్‌, సంతోష్‌ పాల్గొన్నారు. 

విద్యార్థులు కష్టపడి చదవాలి

ఉట్నూర్‌ రూరల్‌ : విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్కారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదిలాబాద్‌కు చెందిన శ్రీ వైకుంఠ ట్రస్టు ఆధ్వర్యంలో విదార్థులకు 200 డిక్షనరీలు అందించారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్‌ నవీన్‌ యాదవ్‌, ఎస్‌వో శ్రీధర్‌బాబు, హెచ్‌ఎం శ్యాముల్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సంధ్య పాల్గొన్నారు. 


logo