గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 11, 2020 , 23:33:57

పథకాల అమలుపై కేంద్ర బృందం పరిశీలన

పథకాల అమలుపై కేంద్ర బృందం పరిశీలన

నార్నూర్‌ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును మంగళవారం జాతీయ స్థాయి బృందం సభ్యులు సునీల్‌కుమార్‌, శ్రీకుట్టి, రవికుమార్‌ పరిశీలించారు. నార్నూర్‌, గాదిగూడ మండల కేంద్రాలతోపాటు పర్సువాడ(బి), చోర్‌గావ్‌ పంచాయతీల్లో పర్యటించారు. సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. వాటర్‌షెడ్‌ పనులు, నర్సరీల నిర్వహణ, డంపింగ్‌యార్డు, సేంద్రియ షెడ్డు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు పరిశీలించారు. ఐకేపీ ద్వారా మహిళా సంఘాలకు అందుతున్న పథకాలు, పింఛన్ల పంపిణీలో లోపాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామేశ్వర్‌, భుక్యా శివ్‌లాల్‌, ఈజీఎస్‌ ఏపీవోలు జాదవ్‌ శేషారావ్‌, సురేశ్‌, సర్పంచులు ఆత్రం అనసూయ, సిడాం జంగు, బానోత్‌ గజానంద్‌ నాయక్‌, గంగాసింగ్‌, ఈజీఎస్‌, ఐకేపీ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. 


logo