మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 11, 2020 , 23:33:57

త్వరలో ఇంటింటికీ శుద్ధజలం

త్వరలో ఇంటింటికీ శుద్ధజలం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రజలకు శుద్ధజలాన్ని అందించడానికి మిషన్‌ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనులు పూర్తికావస్తున్నాయని తెలిపారు. కొన్ని చోట్లు వాటర్‌ ట్యాంకు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పట్టణంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు బిగించి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, కౌన్సిలర్లు సంద నర్సింగ్‌, కౌన్సిలర్లు ఉన్నారు. 

చైర్మన్‌, కౌన్సిలర్‌కు సన్మానం

మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌తోపాటు భుక్తాపూర్‌ కాలనీ కౌన్సిలర్‌ వెనగంటి ప్రకాశ్‌ను కాలనీ వాసులు సన్మానించారు. ముందుగా శాకాంబరీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీ ప్రజలు చైర్మన్‌, వార్డు కౌన్సిలర్‌కు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, పలువురు కౌన్సిలర్లు, వార్డు ప్రజలు ఉన్నారు. 

జమైత్‌ ఉలేమా ఈ హింద్‌ ఆధ్వర్యంలో..

ఎదులాపురం : జిల్లా కేంద్రంలో షాదీఖానలో జమైత్‌ ఉలేమా ఈ హింద్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, వైన్‌చైర్మన్‌ జహిర్‌ రంజనీలను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సాజీదుద్దీన్‌, జహుర్‌ఖాన్‌, జమైత్‌ ఉలేమా ఈ హింద్‌  అధ్యక్షుడు అఫజ్‌ అబూ బకార్‌, తదితరలు పాల్గొన్నారు.


logo
>>>>>>