బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 11, 2020 , 00:00:37

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. మండలంలోని సహకార సంఘంలో ఉపసంహరణల అనంతరం 9 డైరెక్టర్‌ స్థానలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల్లో ఒక్కో పదవికి ఇద్దరు చొప్పున బరిలో ఉన్నారు. 

తలమడుగు మండలంలో..

తలమడుగు: తలమడుగు మండలంలో సొసైటీల్లో ప్రధాన పార్టీల నాయకులు రంగంలో దిగి అభ్యర్థులను   బుజ్జగించడంతో  కొన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్ని  చోట్ల పోటీ అనివార్యంగా మారింది. స్కృటినీ అనంతరం ఉపసంహరణ తర్వాత అధికారులు బరిలో ఉండే అభ్యర్థులకు ప్రకటించి గుర్తులను కేటాయించారు. ఒక్కో చోట డైరెక్టర్‌ పదవికి ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్నారు. తలమడుగు సొసైటీలో 13 స్థానాలకు గాను 9 ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత డీసీసీబీ చైర్మన్‌ ముడుపు దామోదర్‌రెడ్డి ఎకగ్రీవం అయ్యారు. 4 స్థానాల్లో 9 మంది పోటీలో ఉన్నారు. ఝరి సొసైటీలో 9వ వార్డు అల్వాల కచ్రుబాయి ఏకగ్రీవం అయ్యారు. 12 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రెండు సొసైటీల్లో మొత్తం 16 స్థానాలకు 33 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఏకగ్రీవమైన వార్డులు..

తలమడుగు సొసైటీలో 1వ వార్డు నల్ల పద్మాకర్‌ రెడ్డి, 3 వ వార్డు జంగు శ్రీనివాస్‌ రెడ్డి, 4వ వార్డు రెంజర్ల ఆశమ్మ, 5వ వార్డు విఠల్‌, 7వ వవార్డు లోక లింగారెడ్డి, 9వ  వార్డు లక్ష్మి, 10వ  వార్డు గోక మహేందర్‌రెడ్డి, 11వ వార్డు  పెందూర్‌ మోతీరాం ఏకగ్రీవమయ్యారు. 


నేరడిగొండ మండలంలో..

నేరడిగొండ : మండలంలోని నేరడిగొండ, కుమారి పీఏసీఎస్‌లకు ఎనికలు జరుగనున్నాయి.  నేరడిగొండలో 11 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా, కుమారిలోఒక్కరే ఉపసంహరించుకున్నారు. నేరడిగొండ పీఏసీఎస్‌లో 8 స్థానాలు ఏకగ్రీవం కాగా, కుమారి పీఏసీఎస్‌లో 7 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి సుశీల్‌ తెలిపారు. నేరడిగొండలోని 1, 3, 6, 7, 9వ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కుమారిలో 1, 3, 5, 7, 8, 11 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు చెప్పారు. నేరడిగొండ పీఏసీఎస్‌ పరిధిలో  2వ వార్డు మురళీమోహన్‌కృష్ణ, 4వ వార్డులో ఆడె బన్సి, 5వ వార్డులో గోపిచంద్‌, 8వ వార్డులో రాంచందర్‌, 10వ వార్డులో కళాలి వెంకటరమణ, 11వ వార్డులో అన్‌రెడ్డి నారాయణరెడ్డి, 12వ వార్డులో సింగాలి కాంత, 13వ వార్డులో ఏనుగు రజిత ఏకగ్రీవం కాగా, కుమారి పీఏసీఎస్‌ పరిధిలోని 2వ వార్డు శంకర్‌, 4వ వార్డు జొన్నల లింగన్న, 6వ వార్డు లక్ష్మి, 9వ వార్డు భూమయ్య, 10వ వార్డు కొయ్యడి చిన్న గంగయ్య, 12వ వార్డు బత్తుల గంగాధర్‌, 13వ వార్డులో పూదరి గంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.


ఏకగ్రీవమైన సభ్యులు..

11 వార్డుకు సిడాం గౌరుబాయి, ఐదవ వార్డుకు మధురబాయి , తొమ్మిదో వార్డుకు ఆడే సుభాష్‌, 8వ వార్డుకు వాగ్మారే పుండలిక్‌, పదో వార్డుకు రాథోడ్‌ గణపతి, 13వ వార్డుకు నరేశ్‌, మూడవ వార్డుకు సామ ప్రభాకర్‌, నాలుగో వార్డుకు టిబోటే జ్ఞానోబ, ఆరో వార్డుకు కాగ్నే నారాయణ అయ్యారు. ఒకటో వార్డులో రాథోడ్‌ దేవాసింగ్‌, రాథోడ్‌ జైత్రాం మధ్య పోటీ ఉండగా, రెండో వార్డులో అవునూరి పెద్ద గంగన్న, పిట్ల శంకర్‌ల మధ్య, ఏడో వార్డులో రాథోడ్‌ పరుశురాం, సుభాష్‌ మద్య, 12వ వార్డులో ఏరుమల రవి, కొమ్ము రాంచందర్‌ల మధ్య పోటీ జరుగనుంది.


ఇంద్రవెల్లి ఏకగ్రీవం..

ఇంద్రవెల్లి : స్థానిక సహకార సంఘంలో 6వ వార్డులో విక్రమ్‌, 13వ వార్డులో శివాజీ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 13 వార్డులకు చెందిన డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. 


logo