సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 10, 2020 , 23:58:11

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఆదిలాబాద్‌ రూరల్‌: విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ అన్నారు. సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని భీంపూర్‌ కేజీబీవీలో విద్యార్థినులకు అల్బెండజోల్‌ మాత్రలు వేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేజీబీవీలను ఏర్పా టు చేసిందని అన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడానికి కృషి చేస్తున్నదని తెలిపారు. పాఠశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. విద్యార్థులు మట్టిలో ఆడుకున్నప్పుడు నులి పురుగులు కడుపులోకి వెళ్లి కడుపు నొప్పి, వాంతులు విరేచనాలు వంటి సమస్యలతో ఇబ్బంది కలిగిస్తాయని తెలిపారు. ఇది ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని వివరించారు. 19 ఏండ్లలోపు పిల్లలందరూ అల్బెండజోల్‌ మాత్రలు తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మాట్లాడుతూ..  విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దన్నారు. అనంతరం విద్యార్థినులకు మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్‌ డాక్టర్‌ రాజీవ్‌, డీఎంహెచ్‌వో చందు, డీఈవో రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అశోక్‌, డీఐవో శ్రీకాంత్‌, మాస్‌మీడియా అధికారి వెంకట్‌రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.


logo