గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 09, 2020 , 23:25:31

టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను రైతు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను రైతు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

ఉట్నూర్‌ రూరల్‌: త్వరలో జరగబోయే సహకార సంఘా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని  ఎమ్మెల్యే రేఖానాయక్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు విజయం సాధించి చైర్మన్‌ పదవి దక్కించుకుంటుందన్నారు. ఉచితంగా 24గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు, సకాలంలో ఎరువులు, రాయితీపై విత్తనాలు అందిస్తున్న తీరును  ఓటర్లకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగానే భరత్‌, దాసండ్ల ప్రభాకర్‌, మండల రైతు సమన్వయకర్త అజీముద్దీన్‌, టైగర్‌జోన్‌ వార్డెన్‌ ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


logo
>>>>>>