ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 09, 2020 , 23:23:44

ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు

ఆదిలాబాద్‌ రూరల్‌:  జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్‌ జెండా ఎగురవేశారు. అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ కుమార్‌ మాట్లాడుతూ..  ఉపాధ్యాయుల సమస్యల సాధనలో పీఆర్టీయూ ఎల్లప్పుడూ ముందుంటుందని, మూడు దశాబ్దాలుగా సంఘ ప్రాతినిధ్యంతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని గుర్తుచేశారు. ఇంక్రిమెంట్లు, చైల్డ్‌ కేర్‌ లీవ్‌ వంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత పీఆర్టీయూకే దక్కుతుందన్నారు. సీపీఎస్‌ రద్దు కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులను మంజూరు చేయించింది పీఆర్టీయూనేనని గుర్తు చేశారు. ప్రధాన కార్యదర్శి కుడాల రవీందర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక సభ్యులున్న సంఘం పీఆర్టీయూనే అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం త్వరలో కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు దారుట్ల రమేశ్‌, రాజన్న, జనార్దన్‌గౌడ్‌, నారాయణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దారుట్ల జీవన్‌, నల్లా రత్నాకర్‌రెడ్డి, సత్యనారాయణ్‌ గౌడ్‌, భాస్కర్‌, లక్ష్మీపతి, లక్ష్మణ్‌, జక్కుల శ్రీనివాస్‌, పవన్‌ రావ్‌, అరుణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.


logo