సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 08, 2020 , 23:48:27

సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శం

సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు.   పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలను ఆదర్శంగా మార్చారని గుర్తుచేశారు. త్వరలో పట్టణ ప్రణాళిక అమలు కాబోతున్నదని తెలిపారు.   కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, కౌన్సిలర్లు బండారి సతీష్‌, సంద నర్సింగ్‌, అలాల్‌ అజయ్‌, ఆవుల వెంకన్న, నాయకులు కొండ గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బంగారుగూడ పాఠశాల పరిశీలన

పట్టణానికి సమీపంలో ఉన్న బంగారుగూడ పాఠశాలను మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కొనసాగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. logo