మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 08, 2020 , 00:00:02

జీపీలకు పన్నుల టార్గెట్‌

జీపీలకు పన్నుల టార్గెట్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  గ్రామాల వారీగా ఆస్తి పన్ను లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 467 జీపీలకు అనుబంధ గ్రామాలకు కలిపి 2019 - 20కి గాను 4.50 కోట్లను టార్గెట్‌ ఇచ్చారు. వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటి వరకు 1.52 కోట్లు వసూలు కాగా.. 33.77శాతంగా నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరానికి గడువు ఇంకా రెండు నెలలే ఉండగా.. అధికారులు పన్నుల వసూళ్లను ముమ్మరం చేస్తున్నారు. మొండి బకాయిదారులకు నోటీసులను సిద్ధం చేస్తున్నారు. గ్రామాల వారీగా ప్రత్యేక టీంల ఏర్పాటు చేస్తున్నారు. గడువు లోగా వంద శాతం పన్నుల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. 

మండలాల వారీగా టార్గెట్‌..

జిల్లాలో 18 మండలాలు ఉండగా.. 467 జీపీలు ఉన్నాయి.  2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను టార్గెట్‌  రూ. 4.50 కోట్లుగా ఉంది. ఆదిలాబాద్‌ మండలానికి రూ. 22,14,524 లక్ష్యం ఉండగా..రూ. 11,61,174 వసూలు అయ్యాయి.  బజార్‌హత్నూర్‌ మండలానికి రూ. 16, 53, 642 కాగా.. రూ. 4, 83, 145 వసూలయ్యాయి. బేలాకు రూ. 30, 89, 466 టార్గెట్‌ ఉండగా రూ. 13, 14, 965 వసూలు చేశారు. భీంపూర్‌కు రూ. 11,19,735 కాగా రూ. 5,07845 వసూలయ్యాయి. బోథ్‌కు రూ. 44, 28, 578 ఉండగా రూ.16, 81,281 వసూలయ్యాయి. గాదిగూడకు  రూ. 1207160 టార్గెట్‌ కాగా.. రూ. 453749 వసూలు చేశారు. గుడిహత్నూర్‌కు రూ. 24, 77, 679 టార్గెట్‌ ఉండగా..రూ. 11, 59, 581కి పన్నుల వసూళ్లు చేరుకున్నాయి. ఇచ్చోడకు రూ. 48, 99, 683 టార్గెట్‌ ఉండగా రూ. 12, 90, 927 వసూలు అయ్యాయి. ఇంద్రవెల్లికి రూ. 37,05,540 ఉండగా రూ.17, 84, 206కు చేరుకుంది. జైనథ్‌కు రూ. 45, 45, 600 టార్గెట్‌ ఇవ్వగా రూ. 11, 93, 785 వసూలు చేశారు. మావలకు రూ. 516680 టార్గెట్‌ ఉండగా రూ. 241622కు చేరుకుంది. నార్నూర్‌కు రూ. 17, 53, 089 టార్గెట్‌ ఉండగా రూ. 5, 51,510 వసూలు అయ్యాయి. నేరడిగొండకు రూ. 26, 67, 778 టార్గెట్‌ కాగా రూ. 7,08,170కు చేరుకుంది. సిరికొండకు రూ. 11,94,153 టార్గెట్‌ కాగా రూ. 3,28,492 వసూలు చేశారు. తలమడుగుకు రూ. 19,84,460 లక్ష్యం కాగా..10,62,342 వసూలు చేశారు. తాంసికి రూ. 15,49,555 గాను రూ.4,27,020 వసూలు చేశారు. ఉట్నూర్‌కు రూ. 60,73,382 టార్గెట్‌ ఉండగా రూ. 8,76,123కు పన్ను వసూళ్లు చేశారు. మొత్తం 4.50.80.704 కోట్లు టార్గెట్‌ ఉండగా..ఇప్పటి వరకు 1.52.25. 937కోట్లు వసూలు చేశారు. ఇంకా 3,09,87, 309 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. 

ప్రత్యేక టీంలు ఏర్పాటు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఆస్తి పన్నులు లక్ష్యం నిర్దేశించగా గడువులోగా పన్నులు వసూలు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. గత ఏడాది నుంచి పన్నులు చెల్లించని వారిని గుర్తించారు. మొండి బకాయిదారులకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీల వారీగా పన్నుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేశారు. వారం పది రోజుల్లో పన్నుల వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. ఇందు కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు. డప్పు చాటింపు, మండలాలు, మేజర్‌ జీపీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. సకాలంలో ట్యాక్స్‌, నాన్‌ట్యాక్సును వంద శాతం వసూలు చేసి  రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి అధికారులు కృషి చేస్తున్నారు. 


logo
>>>>>>