మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 07, 2020 , 23:54:21

జామిని గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం

జామిని గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం

జైనథ్‌: మండలంలోని జామిని గ్రామాన్ని కేంద్ర బృందం శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు సునీల్‌, శ్రీకుట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా గ్రామసభ నిర్వహించి పింఛన్లు, ఉపాధిహామీ పథకం వివరాలు తెలుసుకున్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారో సభ్యులును అడిగి తెలసుకున్నారు. సాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామంలోని గిరిజనులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లను పోస్టాఫీసు ద్వారా కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని గ్రామస్తులు కోరారు. అనంతరం ఉపాధిహామీ పథకం కింద నాటిన మొక్కలతోపాటు పాంఫాండ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీవో జగ్గేరావు, ఏపీఎం చంద్రశేఖర్‌, నోడల్‌ అధికారి రవికుమార్‌, సర్పంచ్‌ కాంతాబాయి, పంచాయతీ కార్యదర్శి అశ్విని, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ధర్ము, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సునిల్‌, నాయకులు పాల్గొన్నారు.


logo
>>>>>>