శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 07, 2020 , 01:06:40

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టాలి

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టాలి

బేల : సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమని, అభ్యర్థులు ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదిలాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌ అన్నారు. డోప్టాల, బేల సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, ముఖ్య నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10వేలు, రైతు కుటుంబానికి రైతు బీమా పథకం అమలు చేస్తున్న విషయాలను వివరించాలన్నారు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను సహకార ఎన్నికల్లో గెలిపించాలని అన్నారు.  సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుతో నిలబడిన అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌ అన్నారు. గ్రామాల్లో నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. 


పార్లమెంట్‌, అసెంబ్లీ, సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకున్న మాదిరిగానే సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ ఠాక్రే, పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు దేవన్న, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వట్టిపెల్లి ఇంద్రశేఖర్‌, కోఆప్షన్‌ సభ్యుడు తన్వీర్‌ఖాన్‌, నాయకులు మంగేశ్‌ ఠాక్రే, సతీశ్‌ పవార్‌, సంతోష్‌ బెదుల్కర్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 


logo