ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 07, 2020 , 01:06:09

హరితహారం పనులు ముమ్మరం చేయాలి

హరితహారం పనులు ముమ్మరం చేయాలి

తాంసి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పనులను వేగవంతం చేయాలని డీఆర్డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని వడ్డాడిలో గురువారం నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం మొదట్లో మొక్కలు నాటేలా పనులు వేగవంతం చేయాలన్నారు. నర్సరీలో డిమాండ్‌ ప్రకారం మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా పంచాయతీ అధికారులు చూడాలన్నారు. ఇప్పటి నుంచే మొక్కలను నర్సరీలో పెంచడంతో జూన్‌ నాటికి అవి బాగా పెరగడంతో పాటు నాటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. నర్సరీ నిర్వాహకులు జూన్‌ నాటికి మొక్కలు చేతికి వచ్చేలా చూడాలన్నారు. మొక్కల పెంపకంపై అశ్రద్ధ వహిస్తే సంబంధిత సిబ్బంది, అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో రవీందర్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఈజీఎస్‌ సిబ్బంది ఉన్నారు.logo