మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 06, 2020 , 00:38:58

పశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

పశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

ఇచ్చోడ: పశువుల సంరక్షణకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ సురేశ్‌ అన్నారు. బుధవారం మండలంలోని గాంధీనగర్‌ గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులు ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఉచిత గాలికుంటు నివారణ టీకాలను గ్రామాల వారీగా పశువులకు వేయిస్తున్నదని పేర్కొన్నారు. గ్రాసం కొరత నివారణకు 50 శాతం రాయితీపై రైతులకు గడ్డి విత్తనాలను అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ  కార్యక్రమంలో పశువైద్య సహాయ సంచాలకులు రామారావు, స్థానిక వైద్యాధికారి రాథోడ్‌ గోవింద్‌ నాయక్‌, సూరజ్‌, పశువైద్య సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.


పశువులకు టీకాలు  వేయించాలి

నేరడిగొండ: పశువులు వ్యాధుల బారిన పడకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని డీవీఏహెచ్‌వో డాక్టర్‌ సురేశ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని నారాయణపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ధార్మికనగర్‌ గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు ఎలాంటి చికిత్సలు అవసరమైనా పశువైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. అన్ని రకాల వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో గాలికుంటు వ్యాధి టీకాలతో పాటు పశువులకు ట్యాగ్‌లు(చెవిపోగులు) వేస్తున్నామన్నారు. ఆవులకు, గేదెలకు తప్పకుండా ట్యాగ్‌లు వేయించాలని చెప్పారు. ఇప్పటి వరకు 158 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏహెచ్‌ రామారావు, సర్పంచ్‌ జాదవ్‌ పరశురాం, మండల వైద్యాధికారి సుశీల్‌, వీఎల్‌వో విజయలక్ష్మి, ఎల్‌ఎస్‌ఏ అరుణ్‌, వీఏ అనిత, సిబ్బంది సురేశ్‌, గంగయ్య, జంగు, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>